స్పీకర్ కు ఎంపీ ధర్మ పురి అరవింద్ ఫిర్యాదు

భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు స్పీకర్ ఓం బిర్లా ఫోన్ చేశారు;

Update: 2022-01-29 02:17 GMT
dharmapuri arvind, mp, speaker, ombirla, armur
  • whatsapp icon

భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు స్పీకర్ ఓం బిర్లా ఫోన్ చేశారు. ఇటీవల ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ధర్మపురి అరవింద్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. అరవింద్ కు చెందిన ఐదు వాహనాలను కొందరు ధ్వంసం చేశారు. పసుపు బోర్డు పేరుతో కొందరు టీఆర్ఎస్ నేతలే ఆందోళనకు దిగి తనపై హత్యాయత్నం చేశారంటూ అరవింద్ చెబుతున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరపిస్తున్నారు.

ఫోన్ చేసి మరీ....
దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్వయంగా ధర్మపురి అరవింద్ కు ఫోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా కోరారు. దాడి ఎవరు చేశారు? పోలీసులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఇటీవల ప్రివిలేజ్ కమిటీ మరో ఎంపీ బండి సంజయ్ పట్ల అనుచితంగా వ్యవహరించిన పోలీసులకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీంతో అరవింద్ కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నారని తెలిసింది.


Tags:    

Similar News