ముగిసిన మేడారం జాతర
మేడారం జాతర ముగిసింది. జాతరకు ఒకటిన్నర కోటి మంది భక్తులు హాజరయ్యారని ప్రభుత్వం ప్రకటించింది
మేడారం జాతర ముగిసింది. అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగిసినట్లు ప్రకటించారు. జాతరకు ఒకటిన్నర కోటి మంది భక్తులు హాజరయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన జాతర ప్రారంభమయింది. జాతర ప్రారంభమవ్వడానికి నెలరోజుల ముందునుంచే అరవై లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు. జాతర నాలుగు రోజుల్లో 75 లక్షల మంది భక్తులు వచ్చారు.
జాతర ముగిసినా.....
జాతర ముగిసినా అక్కడ ఏర్పాట్లు కొన్ని రోజులు ఉండనున్నాయి. జాతర ముగిసినా మేడారానికి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి చెప్పారు. మేడారం జాతరకు ప్రభుత్వం 75 కోట్లు వెచ్చించిందని తెలిపారు.