Telangana : ఐదు రోజులు వర్షాలే.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2024-06-17 02:29 GMT

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో మోస్తరుగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈరోజు ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఈ నెల 23వ తేదీ వరకూ...
ఈ నెల 23వ తేదీ వరకూ వర్షాలు అనేక జిల్లాల్లో పడతాయని తెలిపింది. దీంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది.


Tags:    

Similar News