తెలంగాణలో రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్ప పీడనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరించింది.
ఏపీలో కూడా...
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. కొద్ది గంటల్లోనే కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మరో మూడు రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.