తెలంగాణకు రెడ్ అలర్ట్

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది;

Update: 2022-08-06 03:17 GMT

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

నేటి నుంచి భారీ వర్షాలు
నారాయణపేట, మహబూబ్‌ నగర్, వనపర్తి, నాగర్‌ కర్నూలు, సంగారెడ్డి, వికారాబాద్, , మహబూబాబాద్ , సిద్ధిపేట్, ఆదిలాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాజెక్టులు మళ్లీ పొంగి పొరలే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.


Tags:    

Similar News