రెయిన్ అలర్ట్ : నేడు, రేపు భారీ వర్షాలు
హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ కు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురిసినట్లు చెప్పారు. అల్ప పీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. నిన్న హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో పెద్దయెత్తున ట్రాఫిక్ స్థంభించింది.
ఉపశమనం కలిగించినా....
ఉక్కపోతతో అలమటించి పోతున్న నగర వాసులకు కొంత ఉపశమనం లభించినా వర్షాలు కురియడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల పాటు నలభై నుంచి యాభై కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లిన వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.