ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.;
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అల్పపీడనం....
వాయవ్య, పశ్చిమ బంగాళాఖాతం పరిసరపా్రంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. ఉత్తర్ ఏపీ జిల్లాలు, దక్షిణ ఒడిశా జిల్లాలో ఈ అల్పపీడనం కొనసాగుతుంది. వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.