మరో రెండు రోజులు భారీ వర్షాలే

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.;

Update: 2022-07-30 02:51 GMT

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉదయం అంతా ఎండ ఉండటంతో తగ్గుముఖం పడుతుందని భావించిన ప్రజలు రోడ్లమీదకు వస్తున్నారు. మధ్యాహ్నానికి ముసుర్లు కమ్మి భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలకు ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రమే కాకుండా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నాయి.

వ్యాపారాలు...
గత వారం రోజులుగా తమకు వ్యాపారాలు సక్రమంగా నడవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. చిరు వ్యాపారుల సంగతయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. వాళ్లకు వ్యాపారమే సాగడం లేదు. భారీ వర్షాలు చిరు వ్యాపారుల పట్ల శాపంగా మారాయి. రోడ్లమీదకు నీరు చేరుతుండటంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లు తెరిచి లోతట్లు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తుంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News