తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

తెలంగాణలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Update: 2022-01-30 01:52 GMT

తెలంగాణలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు చలిగాలులు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఉదయం వేళల్లో మంచుతోపాటు చలిగాలులు వీస్తాయని వాతావారణ శాఖ తెలిపింది.

సాధారణం కంటే....
సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఏజెన్సీ ప్రాంతాలైన కుమరం భీం జిల్లాలో 5.8, సిర్పూర్ లో 5.8, గిన్నెధరిలో 6, న్యాలకల్ లో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజులు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ బయటకు రావాల్సి ఉంటుందని పేర్కొంది.


Tags:    

Similar News