ఆరు గ్యారెంటీలపై సెటైర్లు
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై మంత్రి హరీశ్ రావు సెటైర్ వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలు కర్ఫ్యూ ఉంటుందన్నారు
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై మంత్రి హరీశ్ రావు సెటైర్ వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలు కర్ఫ్యూ ఉంటుందన్నారు. ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి వస్తాడన్నారు. పదవిలో వచ్చే వరకూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతూనే ఉంటారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిశ్రమలకు ఆరు నెలలు హాలిడే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇటీవల కాంగ్రెస్ కు రెండో రాజధాని బెంగళూరుగా మార్చుకున్నారని, వయా బెంగళూరు ఢిల్లీకి వెళ్లేందుకు ఉచితంగా విమానం టిక్కెట్లు మాత్రం వారికి దక్కుతాయని ఛలోక్తి విసిరారు. కాంగ్రెస్ గ్యారెంటీలు పోస్ట్‌డేటెడ్ చెక్‌లు లాంటివని సెటైర్ వేశారు.
ఆరునెలలకో సీఎం...
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో ఏమున్నాయని ఆయన ప్రశ్నించారు. వాళ్లు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు చెబుతారన్నారు. వాళ్ల హై కమాండ్ ఢిల్లీలో ఉంటే బీఆర్ఎస్ హైకమాండ్ గల్లీలో ఉంటుందన్నారు. కేసీఆర్ ఇంకా మ్యానిఫేస్టో విడుదల చేయలేదని, ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరతారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగానే మ్యానిఫేస్టో ఉంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని ఆయన తెలంగాణ ప్రజలకు హితవు పలికారు.