గవర్నర్ పై ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఎమ్మెల్సీల విషయంలో తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఎమ్మెల్సీల విషయంలో తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అజెండాతోనే తెలంగాణ గవర్నర్ పనిచేస్తున్నారన్నారు. తమిళి సై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యే ముందు రోజు కూడా బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అభ్యంతరం చెబుతారన్నారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల ఫైలును గవర్నర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
సర్కారియా కమిషన్ నిబంధనలకు...
ఇది సర్కారియా కమిషన్ నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు. గవర్నర్ వ్యవస్థ భారత్ లో అవసరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బ్రిటీష్ కాలం నాటి వ్యవస్థను కంటిన్యూ చేయడం ఎందుకంటూ నిలదీశారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారరు. ప్రధాని హోదాను వైస్రాయ్‌ని చేస్తారా? అని కూడా ప్రశ్నించారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై పగబట్టాయన్న కేటీఆర్ మాస్టర్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ అంటూ ఎద్దేవా చేశారు.