ఎల్బీనగర్ టు హయత్ నగర్ మెట్రో రైల్
వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో రైలును విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు;
వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో రైలును విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని ఆయన వెల్లడించారు.
వచ్చే ఎన్నికల తర్వాతే...
వచ్చే ఎన్నికల్లో ఎటూ గెలిచేది టీఆర్ఎస్ మాత్రమేనని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, హయత్ నగర్ వరకూ మెట్రో రైలును విస్తరిస్తామని తెలిపారు. మెట్రో రైలు హైదరాబాద్ నగరంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.