ముగిసిన కేటీఆర్ అమెరికా పర్యటన

తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన నేటితో ముగియనుంది. భారీ పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో కేటీఆర్ పర్యటన కొనసాగింది.

Update: 2022-03-27 04:29 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన నేటితో ముగియనుంది. తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో కేటీఆర్ పర్యటన కొనసాగింది. అయితే చివరి రోజున తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అనేక పరిశ్రమలు ముందుకు వచ్చాయి. చివరి రోజు నాలుగు సంస్థలు తాము తెలంగాణలో పరిశ్రమలను స్థాపించేందుకు సిద్ధమని అంగీకారాన్ని తెలిపాయి.

భారీ పెట్టుబడులు...
లైఫై సైన్సెస్, ఆర్ఏ చెమ్ ఫార్మా, అవ్రా లేబిల్ కంపెనీ, అడ్వెంట్ ఇంటర్నేషనల్, స్లే బ్యాక్ ఫార్మా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. మొత్తం దాదాపు ఏడు రోజుల పాటు సాగిన కేటీఆర్ అమెరికా పర్యటనలో తెలంగాణకు భారీ పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు రావడం విశేషం.


Tags:    

Similar News