నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం
నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మంత్రి పొన్నొం ప్రభాకర్ వెళ్లనున్నారు. కేసీఆర్‌ను మంత్రి పొన్నం ఆహ్వానించనున్నారు.
నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మంత్రి పొన్నొం ప్రభాకర్ వెళ్లనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం తరపున స్వయంగా వెళ్లి కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించనున్నారు. కేసీఆర్ ను సభకు రావాలని కోరనున్నారు. ఆయనకు ఇన్విటేషన్ ఇచ్చి రావాలని కోరనున్నారు.
ఈ నెల 9న...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా కలవనున్నారు. ఈ నెల 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించే బాధ్యతను రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఉంచారు.