మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్ అని ఆయన చెప్పారు.

Update: 2022-10-19 07:16 GMT

మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్ అని ఆయన చెప్పారు. కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను వదిలి కేంద్ర రాజకీయాలకు వెళితే ఖచ్చితంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. తమ పార్టీలో కేటీఆర్ కు మించి మరెవ్వరూ ముఖ్యమంత్రి కాలేరన్నారు. ఆయనకున్న విషయ పరిజ్ఞానం, సబ్జెక్టులపై పట్టు ఆయనను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తాయని చెప్పుకొచ్చారు.

కేటీఆర్ సీఎం...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. కేంద్ర రాజకీయాల్లో ఆయన బిజీగా మారితే ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ చేపడతారని తెలిపారు. అందులో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాబోయే సీఎం కేటీఆర్ మాత్రమేనని ఆయన తెలిపారు. ఆయనకే ఆ దక్షత ఉందన్నారు. కేంద్రంలో మార్పుకోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాలు పూర్తయితే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.


Tags:    

Similar News