KTR : నేడు కరీంనగర్ కు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కరీంనగర లో పర్యటించనున్నారు;

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కరీంనగర లో పర్యటించనున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. వచ్చే నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని పది మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి తరలి రానున్నారు.
ముఖ్య కార్యకర్తలతో...
కరీంనగర్ బైపాస్ రోడ్డులోని వి కన్వెన్షన్ లో జరిగే ఈ సమావేశానికి ముఖ్య కార్యకర్తలు హాజరు కానున్నారు. వరంగల్ లో వచ్చే నెల 27 వ తేదీన జరిగే పార్టీ రజతోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే కేటీఆర్ సూర్యాపేటలో పర్యటించిన సంగతి తెలిసిందే. వరసగా అన్ని జిల్లాలను కేటీఆర్ పర్యటిస్తున్నారు. కార్యకర్తలలో, నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ కరీంనగర్ రాక సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.