Telangana : నేడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంటనష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించనున్నారు. గతరెండు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగళ్ల వానతో పాటు భారీ వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నష్టపోయిన...
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి వడగళ్ల వానతో నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించే అవకాశముంది. అనేక పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ నేడు అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలున్నాయి.