Delhi lilquor scam: నేడు ఈడీ ముందుకు కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరవుతున్నారు.;

Update: 2023-03-11 02:13 GMT

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరవుతున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఆమె ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వెళ్లనున్నారు. మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టు లోనూ కవిత పేరు ప్రస్తావించడంతో ఆమె ఈ కేసులో కీలక పాత్ర పోషించారని ఈడీ అధికారులు భావిస్తున్నారు. అనుమానిస్తున్నారు. ఆ దిశగా ఆమె విచారణ కొనసాగే అవకాశముంది.

ఢిల్లీలోనే కేటీఆర్...
మరోవైపు ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు, రేపు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. మరోమంత్రి హరీశ్‌రావు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. కవిత కేసు విషయంలో కేటీఆర్ న్యాయనిపుణులతో చర్చించనున్నారు. కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో స్వయంగా కేటీఆర్ వచ్చి న్యాయనిపుణులతో సంప్రందింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 1 మందిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది


Tags:    

Similar News