తెలంగాణ తలవంచదు : కవిత ట్వీట్
ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆమె ట్వీట్ చేశారు.;
ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆమె ట్వీట్ చేశారు. పదో తేదీన మహిళ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన నేపథ్యంలోనే తనకు నోటీసులు జారీ అయ్యాయని ఆమె అన్నారు. రేపు విచారణకు హాజరు కావాలని తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారని, తెలంగాణ ఇటువంటి నోటీసులకు తలవంచదు అన్న అర్థం వచ్చే రీతిలో ఆమె ట్వీట్ చేశారు.
న్యాయ నిపుణులతో...
ఈడీ నోటీసులు అందగానే కల్వకుంట్ల కవిత న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నోటీసులు అందుకున్న కవిత రేపు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే తాను విచారణకు సహకరిస్తానని ముందునుంచే కవిత చెబుతున్నారు. తాను ధర్నాకు పిలుపునిచ్చిన సమయంలోనే నోటీసులు అందడంతో ఆమె విచారణకు హాజరయ్యే తేదీలు మార్చమని అడుగుతారా? లేదా? అన్నది మరికాసేపట్లో తేలనుంది. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత కవిత ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు.