Nagarjuna Sagar : సాగర్ కు పోటెత్తుతున్న వరద

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది.

Update: 2024-08-10 03:31 GMT

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. గత మూడు రోజుల నుంచి నాగార్జు సాగర్ లో ఇరిగేషన్ అధికారులు 26 గేట్లను ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. పదహారు గేట్లు పది అడుగుల మేర ఎత్తారు. పది గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సాగర్ అందాలను చూస్తున్నారు.

సందర్శకుల తాకిడి...
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,60,691 క్యూసెక్కులుగా ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులుగా ఉంది. కిందకు నీటిని విడుదల చేస్తుండటంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు కూడా వరద నీరు పోటెత్తుతుంది.


Tags:    

Similar News