నేటి నుంచి మూడ్రోజులు తెలంగాణకు వర్షసూచన

శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఆగ్నేయ, దక్షిణ దిశల

Update: 2022-01-08 09:46 GMT

నేటి నుంచి మూడ్రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఆగ్నేయ దక్షిణ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తోన్న గాలుల కారణంగా చలితీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నార్త్ ఇండియా నుంచి వీస్తున్న చల్లటి గాలుల కారణంగా మంచుపొరలు ఏర్పడవచ్చని, దీని కారణంగానే అక్కడక్కడా వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఆదిలాబాద్, కుమరం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో జనవరి 10,11 తేదీల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అకాల వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News