గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎన్.ఎస్.యూ.ఐ ఆందోళనకు దిగింది.
గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎన్.ఎస్.యూ.ఐ ఆందోళనకు దిగింది. ముఖ్యమంత్రి ప్రకటించి ఇన్ని రోజులవుతున్నా నోటిఫికేషన్ విడుదల కాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఎన్.ఎస్.యూ.ఐ ఆరోపిస్తుంది.
జాబ్ నోటిఫికేషన్లు....
పెద్ద సంఖ్యలో ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు టీఎస్‌పీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కార్యకర్తలు గాంధీభవన్ లోకి చొరబడతారని భావించిన పోలీసులు దానికి తాళం వేశారు. ఎన్.ఎస్.యూ.ఐ నేతలను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు. గాంధీ భవన్ కు పోలీసులు తాళం వేయడంపై మరికొందరు ఆందోళనకు దిగారు.