ఖమ్మంలో ఒమిక్రాన్ టెన్షన్
ఖమ్మంకి ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. హైదరాబాద్ లో చదువుతున్న ఒక విద్యార్థికి ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్థారణ అయింది
ఖమ్మం నగరానికి ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. హైదరాబాద్ లో చదువుతున్న ఒక విద్యార్థికి ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్థారణ అయింది. ఖమ్మం నగరానికి చెందిన ఒక విద్యార్థిని హైదరాబాద్ లోని మొహిదీపట్నంలోని ఒక కళాశాలలో చదుతుంది. ఆమెకు కొద్ది రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో ఇంటికి చేరకుంది. ఖమ్మంలో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా తేలింది.
44కు చేరిన....
దీంతో ఆ విద్యార్థిని ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే జిల్లా వైద్య అధికారులు ఆమె రక్తనమూనాలను పరీక్షలకు పంపగా ఒమిక్రాన్ అని తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థిని కుటుంబ సభ్యుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కు చేరుకుంది.