ఈ నెల 19న అమెరికాకు కేటీఆర్
ఈ నెల 19వ తేదీన తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. 26వ తేదీ వరకూ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తారు.
ఈ నెల 19వ తేదీన తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 26వ తేదీ వరకూ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తారు. వారం రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉంటారు. మంత్రి కేటీఆర్ తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటన కొనసాగనుంది.
పెట్టుబడులే లక్ష్యంగా....
అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను, ఎన్‌ఆర్ఐలను కలుస్తారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల విషయమై చర్చిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను తేవాలన్న లక్ష్యంతోనే కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళుతున్నారు.