ఎవరేమనుకున్నా గెలుపు మాదే : రేవంత్

ఈసారి బీసీలకు ఎక్కువ స్థానాలను ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2023-09-27 14:16 GMT

ఈసారి బీసీలకు ఎక్కువ స్థానాలను ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలను తమ పార్టీ ఇస్తుందని చెప్పారు. స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుందన్న రేవంత్ విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేలా కాంగ్రెస్ హైకమాండ్ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సామాజికవర్గాల వారీగా టిక్కెట్ల కేటాయింపులో న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈసారి కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని రేవంత్ ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేటీఆర్ జాగీరా? అని ప్రశ్నించారు.

నిరసనలు వద్దంటే ఎలా?
మరోవైపు హైదరాబాద్‌లో నిరసనలపై మంత్రి కేటీఆర్ చేసిిన కామెంట్స్ పైన కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ పదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇక్కడ నిరసన తెలపొద్దు అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నిరసనలు చేయవద్దనడం అర్ధరహితమన్న రేవంత్ ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముందని ప్రశ్నించారు. ఏం హక్కు ఉందని అమెరికాలో నిరసనలు చేశారన్నారు. ప్రతి సమస్యకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేటీఆర్ కు ఏపీ వాళ్ల ఓట్లు కావాలని కాని, వాళ్ల నిరసనలు మాత్రం అవసరం లేదని అన్నారు.


Tags:    

Similar News