కోమటిరెడ్డి నీచుడు.. దరిద్రుడు..దుర్మార్గుడు.. రేవంత్ ఫైర్

మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2022-08-05 14:00 GMT

మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎందరో మహానుభావులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారన్నారు. మునుగోడులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మునుగోడులో కాంగ్రెస్ కాని ఎర్ర జెండా ఎగిరింది కాని మరే పార్టీలకు ఇక్కడ తావులేదన్నారు. అధకారం కోసమే అయితే మునుగోడు గడ్డపై కమ్యునిస్టులు గెలిచి ఉండావారు కారన్నారు. ఏ అధికారం ఉన్నా లేకపోయినా నల్లగొండ జిల్లాలో అభివృద్ధి జరగలేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2018లో పాల్వాయి స్రవంతికి రావాల్సిన టిక్కెట్ రాజగోపాల్ రెడ్డికి పోయిందన్నారు. పాల్వాయి గోవర్థనన్న రాజకీయ చరిత్ర అందరికీ తెలుసునని చెప్పారు. వారి ఆస్తులు కరిగిపోయినా కాంగ్రెస్ జెండాను వీడలేదన్నారు. చరిత్ర హీనుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలను మోసం చేసి అమిత్ షా పక్కన చేరుతున్నారన్నారు.

కాంట్రాక్టుల కోసం...
రాజకీయాల్లో పార్టీలో మారి ఉండవచ్చు కాని కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆ తల్లి సోనియమ్మను కాదని వెళ్లిపోతారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక దుర్మార్గుడు, నీచుడు, దరిద్రుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టుల కోసం అమిత్ షా పక్కన చేరతాడా? అని ప్రశ్నించారు. కమీన్ కుత్తే అని తీవ్ర పదజాలంతో దూషించారు. ఇంత దుర్మార్గుడు సోనియా గాంధీ ప్రతిష్టను అమిత్ షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారన్నారు. 21 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు తెచ్చుకున్నాడన్నారు. ఎమ్మెల్యే కాకపోతే రాజగోపాల్ రెడ్డి వైపు కుక్క కూడా చూడదన్నారు.
ఉప ఎన్నికలతోనే....
ఉప ఎన్నికలు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని భావిస్తే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోటీ చేయవచ్చు కదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు ప్రజలను అడ్డం పెట్టుకుని సొమ్ములు చేసుకుంటున్నాడన్నారు. 2014 కంటే ముందు తన మీద ఒక్క కేసు కూడా లేదని, కేసీఆర్ తనను రాజకీయ కక్ష సాధింపు చేసేందుకు 120 కేసులు కేసీఆర్ పెట్టారన్నారు. తాను 30 రోజులు జైలులో ఉంటే, అమిత్ షా 90 రోజుల్లో జైలులో ఉన్నాడని రేవంత్ గుర్తు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ కు అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తాను ప్రతి గ్రామంలో తిరుగుతానని, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ప్రజలను కోరతానని చెప్పారు.


Tags:    

Similar News