రేవంత్ రెండో సారి ఫిర్యాదు... సెక్షన్ల కారణంగానే?
అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండోసారి ఫిర్యాదు చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండోసారి ఫిర్యాదు చేశారు. సెక్షన్లు మార్చడంతో నా ఫిర్యాదు స్వరూపమే మారిందన్నారు. అందుకే తాను రెండోసారి ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. సెక్షన్ 509 ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తాను ముందుగానే తాము ఇచ్చిన ఫిర్యాదులపై 48 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరామని చెప్పారు.
ఎఫ్ఐఆర్ ఎందుకూ ఉపయోగపడదు....
కానీ ఈరోజు ఉదయం వరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. న్యాయనిపుణుల పరశీలనలో ఉందన్నారు. అందుకే పోలీస్ కమిషనర్ల కార్యాలయం ముట్టడికి ముందుకు వచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్యం సరిగా ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండేవారన్నారు. కానీ తాము వత్తిడి చేయడం వల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాని సెక్షన్లు మార్చారన్నారు. సెక్షన్ 504 నమోదు చేశారన్నారు. ఈ ఎఫ్ఐఆర్ ను చూసిన తర్వాత తిరిగి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఎఫ్ఐఆర్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదన్నారు. అందుకే తాను దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.