Telangana : ఆ నాలుగు ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

తెలంగాణలో నాలుగు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు

Update: 2024-11-26 11:50 GMT

తెలంగాణలో నాలుగు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిశారు. తెలంగాణలో నాలుగు కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని కోరారు. అయితే విమానాశ్రయాలకు అవసరమైన భూములను పౌరవిమానయాన శాఖకు కేటాయించాలన్న కేంద్ర మంత్రి విజ్ఞప్తికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

విమానాశ్రయాల ఏర్పాటుకు...
తెలంగాణలోని వరంగల్ లో విమానాశ్రయం ఏర్పాటు వీలయినంత త్వరగా ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి అడిగిన మేరకు పెద్దపల్లి, ఆదిలాబాద్, కొత్తగూడెంలలో కూడా మరో మూడు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కూడా సహకరించాలని కోరాగా, అందుకు పీజుబులిటీని పరిశీలించేందుకు తమ శాఖకు సంబంధించిన సాంకేతిక బృందాన్ని త్వరలోనే పంపుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా రేవంత్ కు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


Tags:    

Similar News