ఆ 12 మంది ఎవరు...? వీరేనా?

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది

Update: 2021-11-17 02:08 GMT

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 23వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీలను చివరి నిమిషంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందరికీ ట్విస్ట్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయనను ఎమ్మెల్సీని చేశారు.

మళ్లీ ట్విస్ట్ ఇస్తారా?
ఇక స్థానిక సంస్థల కోటా కింద 12 మంది అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంది. ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కొక్క స్థానం, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. నల్లగొండలో కాంగ్రెస్, రంగారెడ్డిలో బీజేపీ పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో కేసీఆర్ అభ్యర్థులుగా ఎవరిని నిర్ణయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News