కేసీఆర్ డెసిషన్.. ఆయనకే రాజ్యసభ సీటు?
తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ కాబోతుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ కాబోతుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికతో రాజ్యసభలో టీఆర్ఎస్ స్థానం ఖాళీ అయింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేసినట్లు తెలిసింది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావుకు రాజ్యసభ పదవిని ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మూడేళ్ల పదవికి...
నిజానికి రాజ్యసభకు తన కుమార్తె కవితను పంపాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆమెను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఈ స్థానానికి మధుసూదనాచారి పేరు మరోసారి వినపడింది. ఆయనను కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేశారు. దీంతో కేసీఆర్ దామోదర్ రావును రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. రాజ్యసభ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగానే పేరు ప్రకటించనున్నారు. ఈ పదవి ఇంకా మూడేళ్లు మాత్రమే మిగిలి ఉంది.