SLBC Accident : జలసమాధి అయిన వారి జాడ కోసం?

శ్రీశైలం ఎడం కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.;

Update: 2025-03-29 04:07 GMT
rescue operations, accident, left tunnel,  srisailam
  • whatsapp icon

శ్రీశైలం ఎడం కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. మృతదేహాలను ఉన్నట్లు గుర్తించిన ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ముప్ఫయి మీటర్ల వరకూ ఈ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈప్రాంతంలోనే ఆరు మృతదేహాలు ఉండే అవకాశముందని భావిస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఇదే ధృవీకరించడంతో అక్కడే తవ్వకాలు జరపాలని ప్రత్యేక అధికారి శివశంకర్ చేసిన సూచనతో సహాయక బృందాలు తమ పనిని నిన్నటి నుంచి ప్రారంభించాయి.

అత్యాధుని పరిజ్ఞానంతో...
ఇప్పటికే 34 రోజులవుతున్న తప్పిపోయిన ఎనిమిది మందిలో రెండు మృతదేహాలు మాత్రమే లభ్యం కావడంతో మిగిలిన ఆరు డెడ్ బాడీస్ దొరికే వరకూ సహాయక చర్యలను కొనసాగించనున్నారు. బ్యాక్ క్రీప్ స్ట్రక్చర్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. టీబీఎం మిషన్ శిధిలాల తొలగింపు ప్రక్రియ కూడా వేగవంతమయింది. అది పూర్తయితే సగం పని పూర్తిచేసినట్లేనని సహాయక బృందాలు భావిస్తున్నాయి. అలాగే పేరుకుపోయిన బురదను, మట్టిని తవ్వడం కూడా సవాల్ గా మారనుంది. అక్కడ తవ్విన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వార టన్నెల్ బయటకు తీసుకురావడం అంత సులువు కాదు.
కన్వేయర్ బెల్ట్ ను...
మొత్తం పన్నెండు బృందాలకు చెందిన 650 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ మరో మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా సుదీర్ఘంగా వెదుకులాటను ప్రాంభిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ను పొడిగించాలని కూడా ఉన్నతాధికారులు నిర్ణయించారు. అప్పుడు తొలగించిన వ్యర్థాలను బయటకు తీసుక రావడం సులువుగా మారుతుందని భావిస్తున్నారు. ఎస్కవేటర్ల ద్వారా పెద్ద పెద్ద బండరాళ్లను తొలగిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉండటంతో అతి జాగ్రత్తగా పనులు చేస్తున్నట్లు సహాయక బృందాలు చెబుతున్నాయి. మృతదేహాలను వెతికి వారి బంధువులకు అప్పగించేందుకే నిరంతరం ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.


Tags:    

Similar News