రేవంత్ సమీక్షకు వారిద్దరూ డుమ్మా

రేవంత్ రెడ్డి సమీక్షకు మెదక్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి దామోదర రాజనరసింహలు హాజరు కాలేదు.

Update: 2022-01-30 06:43 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమంటున్నాయి. నేతల మధ్య సమన్వయం కొరవడింది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఇష్టపడక పోవడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఈరోజు గాంధీభవన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. తొలి విడతగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష జరగనుంది.

మెదక్ పార్లమెంటు పరిధిలో....
అయితే ఈ సమావేశానికి మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహలు హాజరు కాలేదు. వీరు గత కొంత కాలంగా అసంతృప్తిలో ఉన్నారు. ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడంపై పీసీసీ సీరియస్ అయింది. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతుంది.


Tags:    

Similar News