నేటి నుంచి సింగరేణి సమ్మె
సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మూడు రోజుల పాటు సమ్మెలో పాల్గొననున్నాయి.
సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెలో పాల్గొననున్నాయి. గనుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తున్నట్లు సింగరేణి కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్రం తన నిర్ణయం మార్చుకునేంత వరకూ వెనక్కు తగ్గమని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అంద చేసిన కార్మిక సంఘాలు నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెలోకి వెళ్లనున్నాయి.
ప్రయివేటీకరణకు....
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కల్యాణ్ ఖని బ్లాక్ 6, కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి బొగ్గునులను ప్రయివేటు పరం చేయాలని నిర్ణయించింద.ి వేలం వేయాలని డిసైడ్ అయింది. దీనిపై యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెలోకి వెళ్లనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.