సుమన రెడ్డికి మూడో ర్యాంక్

ఇంటర్ మొదటి సంవతర్సం పరీక్షలలో తార్నాకకు చెందిన సుమన రెడ్డి మూడో ర్యాంకు సాధించారు.

Update: 2023-05-10 03:01 GMT

తెలంగాణ ఇంటర్ ఫలితాలు నిన్న సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. అన్నింటా బాలికలదే పై చేయి అంది. ఇక స్టేట్ ర్యాంక్‌లలోనూ బాలికలే అగ్రభాగాన నిలిచారు. ఇంటర్ మొదటి సంవతర్సం పరీక్షలలో తార్నాకకు చెందిన సుమన రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. ఇంగ్లీష్ లో వందకు 95 మార్కులు, సంస్కృతంలో వందకు 99 మార్కులు, బోటనీలో 60 మార్కులకు అరవై, జువాలజీలో అరవైకి అరవై, ఫిజిక్స్‌లో అరవైకి అరవై, కెమిస్ట్రీలో అరవైకి అరవై మార్కులను సుమన సాధించింది.

434 మార్కులతో...
సుమన రెడ్డి తార్నాకలోని గాటిక్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. సుమన కుటుంబం నాగోలులోని బండ్లగూడలో ఉంటుంది. తండ్రి కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. తల్లి సుందరి ఉపాధ్యాయ వృత్లిలో ఉన్నారు. మొత్తం 440 మార్కులకు గాను సుమన రెడ్డి 434 మార్కులు సాధించడంతో ఆ కుటుంబానికి సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. సుమనకు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు దక్కాలని పలువురు ఆకాంక్షించారు.


Tags:    

Similar News