తెలంగాణలో భానుడు భగభగ

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అనేక చోట్ల 40 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Update: 2023-03-31 07:44 GMT

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అనేక చోట్ల 40 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయ ఏడు గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడి భగభగలతో తెలంగాణలో ప్రజలు ఉదయం పది గంటల తర్వాత బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారు.

40 డిగ్రీల ....
మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది. ప్రజలు ఎండవేడిమి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, వ్యాధి గ్రస్థులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో పరీక్ష కేంద్రాల్లో గాలి ఆడేందుకు అవసరమైన చర్యలను విద్యాశాఖ తీసుకుంటుంది. విద్యార్థులు ఉక్కపోతకు గురి కాకుండా చర్యలు ప్రారంభించింది.


Tags:    

Similar News