కవిత పిటీషన్ విచారణ వాయిదా

కవిత పిటీషన్ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈడీ అధికారాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను 26వ తేదీకి వాయిదా పడింది

Update: 2023-09-15 07:57 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటీషన్ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈడీ అధికారాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. సుప్రీంకోర్డులో కేసు పెండింగ్‌లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారంటూ కవిత ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని ఆమె పిటీషన్ లో కోరారు. నళిని చిదంబరానికి ఇచ్చిన వెసులుబాటు తనకు ఇవ్వాలని కవిత తన పిటీషన్ లో కోరారు.

ఈడీ అధికారాలను..
సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయని కవిత ఆశించారు. అయితే కేసు వాయిదా పడటంతో ఆమెకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై గతంలో వేసిన పిటీషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. కవిత వేసిన పిటీషన్ ను ధర్మాసనం వాయిదా వేయడంతో ఈడీ ఎదుట ఆమె హాజరవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News