KCR : చంద్రబాబు గెలుపుపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలుపుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు;

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలుపుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి లేకుంటే చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో గెలిచే వారు కారని కేసీఆర్ అన్నారు. సిరిసింపదల తెలంగాణను దోచుకోవడానికి అందరూ వస్తున్నారని కేసీఆర్ అన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లు తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్న కేసీఆర్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఆయన తెలిపారు.
దోచుకోవడానికే...
తెలంగాణను దోచుకోవడానికే అందరూ ఇప్పుడు ఇక్కడకు వస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్నది చాలక, మళ్లీ ఒకసారి దండెత్తి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని, కానీ తెలంగాణ ప్రజలు అలా వచ్చిన వారిని తన్ని తరిమేయాలని, అందుకు అవకాశమిచ్చిన వారిని కూడా క్షమించకూడదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.