Revnanth Reddy : డీ లిమిటేషన్ పై త్వరలో హైదరాబాద్ లో సభ
డీలిమిటేషన్ పై తర్వాత సమావేశం హైదరాబాద్ లో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు;

డీలిమిటేషన్ పై తర్వాత సమావేశం హైదరాబాద్ లో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల నేతలతో భారీ బహిరంగ సభను కూడా పెడతామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ తో అన్యాయం జరగవద్దని ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. డీ లిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు.
జనాభా ప్రాతిపదికన...
జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గి ఈ ప్రాంత ప్రాధాన్యత తగ్గిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్న ఆయన ఇక మరింత అన్యాయం చేయడానికే ఈ రకమైన ప్రక్రియను తీసుకు వచ్చిందని తెలిపారు. దీనిని అడ్డుకుని తీరాల్సిన అవసరం అందరిపైనా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.