నేడు విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది;

Update: 2023-09-26 03:46 GMT
enforce direcorate, kalvakuntla kavitha, supreme court, petition
  • whatsapp icon

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ కవిత వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

చట్ట విరుద్ధమంటూ...
అయితే ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్పీసీకి విరుద్ధమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నళినీ చిదంబరం మాదిరిగానే తనను కూడా ఇంట్లో విచారించాలని ఆమె న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. తన పిటీషన్ విచారణలో ఉండగానే ఈడీ నోటీసులు జారీ చేసిందని, దీనిపై సుప్రీంకోర్టులో తేలేవరకూ విచారణకు రాలేనని స్పష్టం చేశారు. నేడు సుప్రీంకోర్టులో కవిత పిటీషన్ పై ఎలాంటి ఉత్తర్వులు రానున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News