తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగున్నర గంటల పాటు మంత్రి వర్గ సమావేశం సాగింది
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగున్నర గంటల పాటు మంత్రి వర్గ సమావేశం సాగింది. లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు పథకం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింిది. 118 నియోజకవర్గాల్లో 1100 మందికి వెంటనే దళితబంధు పథకం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇక సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. గృహనిర్మాణ పథకం కింద పేదలు పడిన బకాయీలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.
పేదల సంక్షేమం కోసం...
గృహలక్ష్మి పథకం ద్వారా నాలుగు లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లను మంజూరు చేయాలని కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. ఏప్రిల్ 14 అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. పేదలకు ఉపయోగపడే పలు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గొర్రెల పంపిణీ పథకానికి 4,463 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాశీలో తెలంగాణ తరుపున వసతి గృహం నిర్మించాలని నిర్ణయించింది. శబరిమలలోనూ వసతి గృహాలను నిర్మించాలని నిర్ణయించిందని హరీశ్ రావు తెలిపారు.