Telangana : నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది.;

తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో ప్రారంభం కానున్న ఈ మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో వర్గీకరణకు ఆమోదం తెలవపడానికి అవసరమైన బిల్లులను మంత్రివర్గం ఆమోదించనుంది.
బీసీ గణనకు...
తర్వాత బీసీ గణనకు మరోసారి ఇచ్చిన అవకాశంతో నమోదు చేసుకున్న వారి వివరాలతో కూడిన తుదిగణనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లోనూ, రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా సమావేశం ఖరారు చేయనుంది.