రోడ్డు మార్గంలోనే కేసీఆర్
రోడ్డు మార్గంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరద ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరారు
రోడ్డు మార్గంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరద ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరారు. నిన్న రాత్రి హన్మకొండకు చేరుకున్న కేసీఆర్ అక్కడ వరద పరిస్థితిపై సమీక్షించారు. ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏరియల్ సర్వే చేయాలనుకున్నా వాతవరణం సహకరించకపోవడంతో ఆయన రోడ్డు మార్గం ద్వారా ఏటూరు నాగారం బయలుదేరారు. అక్కడి నుంచి భద్రాచలం చేరుకుంటారు. వరద పరిస్థితులను సమీక్షించడంతో పాటు వరద సహాయక చర్యలను కూడా పరిశీలిస్తారు.
కాసేపట్లో భద్రాచలానికి...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు, రేపు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ప్రధానంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పునరావాస కేంద్రాల్లో అనేక మంది తలదాచుకుంటున్నారు. ఏటూరు నాగారం నుంచి ఆయన నేరుగా భద్రాచలం వద్దకు చేరుకుని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. అధికారులతో సమీక్షలు చేస్తారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లు కూడా ఉన్నారు.