నేటి నుంచి నామినేషన్లు... ఇంకా ఖరారు కాని అభ్యర్థులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించలేదు. మరికొద్దిసేపట్లో ప్రకటించే అవకాశముంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించలేదు. మరికొద్దిసేపట్లో ప్రకటించే అవకాశముంది. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
శాననసభ పక్ష సమావేశం....
వీరితో పాటు మొత్తం జాబితాను ఈరోజు ప్రకటించనున్నారు. ఈరోజు కేసీఆర్ శాసనసభ పక్ష సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు, ధాన్యం కొనుగోలుపై కేంద్ర అనుసరిస్తున్న విధానాలను కూడా కేసీఆర్ చర్చించనున్నారు.