ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా అదేనా?

ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రకటించే అవకాశముంది. ఫైనల్ జాబితా నేడు విడుదల చేయనున్నారు.

Update: 2021-11-15 01:56 GMT

ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రకటించే అవకాశముంది. ఫైనల్ జాబితా నేడు విడుదల చేయనున్నారు. షెడ్యూలు వచ్చి రోజులు గడుస్తున్నా కేసీఆర్ ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒకటి ఖాళీగా ఉంది. మొత్తం ఏడుగురు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించాల్సి ఉంది. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా కింద కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

లిస్ట్ రెడీ....
దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సామాజికవర్గాల వారీగా పాత, కొత్త నేతలకు ఈ ఎంపికలో ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. అనేక మంది ఆశావహులు ఉండటంతో కేసీఆర్ ఎవరి పేరును ఖరారు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల నామినేషన్ కు రేపు ఆఖరి రోజు కావడంతో ఈరోజు అభ్యర్థులను ప్రకటిస్తారంటున్నారు.


Tags:    

Similar News