అభ్యర్థులు ఖరారు... కానీ...?
స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నారు.
స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నారు. మొత్తం 12 మంది అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంది. అర్ధరాత్రి వరకూ ప్రగతి భవన్ కేసీఆర్ మంత్రులతో సమావేశమయ్యారు. అభ్యర్థుల తుది జాబితాను ఫైనల్ చేసినట్లు తెలిసింది. అయితే వీరిలో చాలా మంది కొత్తవారికి కేసీఆర్ అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది.
ఈసారి కూడా....
కేసీఆర్ ఇటీవల ఎంపిక చేసిన ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల విషయంలోనూ ట్విస్ట్ ఇచ్చారు. కొత్త పేర్లు తెరపైకి రావడంతో సీనియర్ నేతలు సయితం అవాక్కయ్యారు. ఈసారి కూడా 12 మందిలో చాలా మంది కొత్త వారినే ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో కేసీఆర్ ఈరోజు జాబితాను ప్రకటించే అవకాశముంది.