Revanth Reddy : ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు
ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు;
ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన చిట్ చాట్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే మెట్రో రైలును కూడా రద్దు చేయడం లేదని, ఎయిర్ పోర్టుకు తక్కువ దూరంలో తీసుకెళ్లేలా ప్రతిపాదనలను రూపొందించనున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేవలం స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు.
మెట్రో రైలును కూడా...
అయితే తాము మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రచారం చేయడం తగదని ఆయన అన్నారు. తమ ప్రతిపాదనకు తక్కువ ఖర్చుతో ఎయిర్ పోర్టుకు చేరుకునే వీలుందన్నారు. రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుల మధ్య కస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తమ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.