Revanth Reddy : నేడు ఎన్ఆర్ఐలతో న్యూయార్క్‌లో రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. ఆయనకు న్యూయార్క్ లో పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు;

revanth reddy, chief minister, america, south korea
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. ఆయనకు న్యూయార్క్ లో పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. పది రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన తెలంగాణలో పెట్టుబడులను సాధించే లక్ష్యంతో అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటించనున్నారు.
పారిశ్రామికవేత్తలతో...
ఈరోజు రేవంత్ రెడ్డి న్యూయార్క్ లో ఎన్‌ఆర్ఐలతో సమావేశం కానున్నారు. వీరితో పాటు కొందరు పారిశ్రామికవేత్తలతోనూ కూడా రేవంత్ సమావేశమై వారిపై పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం కల్పించే రాయితీలను కూడా వివరించనున్నారు. ఈ నెల 14వ తేదీన తిరిగి రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు చేరుకుంటుంది.