Revanth Reddy : నేడు కొడంగల్ కు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ బయలు దేరి వెళుతున్నారు;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ బయలు దేరి వెళుతున్నారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒక ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు రేవంత్ రెడ్డి హాజరవుతారని చెబుతున్నారు. అలాగే సాయంత్రం జరిగే ఇఫ్తార్ విందులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
అధికారులతో సమీక్ష...
కొడంగల్ వెళ్లే ముందు రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్షను నిర్వహించనున్నారు. మున్సిపల్ శాఖ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఆదాయం పెంచే మార్గంతో పాటు ప్రజలపై భారం పడకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించనున్నారు. తర్వాత ఆయన నేరుగా కొడంగల్ కు బయలుదేరి వెళతారు.