Breaking : మూసీ ఆక్రమణల తొలగింపుపై మరోసారి రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది ఆక్రమణపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2024-10-06 12:09 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది ఆక్రమణపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నది ప్రక్షాళన చేపడతామని స్పష్టం చేశారు. ఆయన ఇంజినీర్లకు నియామక పత్రాలు అందచేసే కార్యక్రమంలో మాట్లాడుతూ మూసీ నదిపై ఆక్రమణల తొలగింపునకు సంబందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పిల్లలలకు ఎవరైనా సరస్వతి, గంగ, కావేరి అని పేరు పెట్టుకున్నారని, మూసీ అని ఎవరైనా మూసీ అని తన బిడ్డకు పేరు పెట్టుకున్నారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ నది సుందరీకరణ చేయడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో అనేక ప్రాజెక్టులు నిర్మించినప్పుడు లక్షలాది మంది నిర్వాసితులు కాలేదా? అని నిలదీశాారు.

నిర్వాసితులకు అన్యాయం చేయను...
మూసీ నది నిర్వాసితులకు కూడా తాము ఆదుకుంటామని తెలిపారు. వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని తెలిపారు. సొంత ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. వారికి అన్యాయం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదని ఆయన అన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు మూసీ నిర్వాసితులను రెచ్చగొట్టే పనులను చేపట్టారన్నారు. వారెవ్వరూ అలాంటి వారి మాయమాటలకు లొంగి పోవద్దని తెలిపారు. ఒక ఇల్లు కోల్పోతే ఒక కుటుంబం ఎంత ఆవేదనకు గురి అవుతుందో ఇరవై ఏళ్లు ప్రజాప్రతినిధిగా చేసిన తనకు తెలియదా? అని ప్రశ్నించారు. కొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. మూసీ ప్రక్షాళన వల్ల వందేళ్లు హైదరాబాద్ కు ఢోకా లేదని రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News