Revanth Reddy : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. వాళ్లకు గుడ్ న్యూస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారానికి ఆయన హాజరుకానున్నారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో తొలిరోజు ఎంపీల ప్రమాణ స్వీకారానికి రేవంత్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఆయన రేపు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
మంత్రి వర్గ విస్తరణపై..
పార్టీ హైకమాండ్ ను కూడా కలవనున్నారు. పార్టీ పెద్దలను కలసి మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు. జులై రెండో తేదీన తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన జాబితాను కూడా రూపొందించారని, దానికి పార్టీ హైకమాండ్ నుంచి ఆమోద ముద్ర వేయించుకు వస్తారని చెబుతున్నారు.